
కేరళ, 09 జనవరి (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నేత, శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలంగా నాటారని అన్నారు. అయితే, ఆయన విధానాలని గుడ్డిగా సమర్థించనని వ్యాఖ్యానించారు.
శుక్రవారం కేరళ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలకు అర్హమైనవని పేర్కొన్నారు. 1962లో చైనా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయన్నారు. దాని సాకుగా బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఆయన పేరును దుర్వినియోగం చేయడం సరికాదన్నారు.
'నేను నెహ్రూ అభిమానిని. ఆయన్ని ఆరాధిస్తాను. ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అలా అని ఆయన నమ్మకాలు, విధానాలన్నింటినీ నేను వంద శాతం సమర్థించను. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలకు అర్హమైనవే. ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చాలా దృఢంగా నెలకొల్పారు అని థరూర్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..