
హైదరాబాద్, 09 జనవరి (హి.స.)
అంతరిక్ష పరిశోధనల్లో నేడు అద్భుత
ఘట్టం ఆవిష్కృతం కావలసి ఉండగా.. అనుకోకుండా వచ్చిన సమస్యతో అది నిరవధిక వాయిదా పడింది. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్ మ్యాన్ తొలి స్పేస్ వాక్ నిర్వహించే పనులను భుజానికెత్తుకున్నారు. కానీ ఈ స్పేస్ వాక్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన నలుగురు ఆస్ట్రోనాట్లలో ఒకరి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని తిరిగి భూమికి పంపుతున్నట్లు ఐఎస్ఎస్ ప్రకటించింది. దీంతో నాసా ఆ ఆస్ట్రోనాట్ ను భూమికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నలుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఘట్టానికి నాసా స్వస్తి పలకాల్సిన పరిస్థితి వచ్చింది. స్పేస్ వాక్ ను నిరవధిక వాయిదా వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు