భాగ్యనగరవాసులకు గుడ్ న్యూస్.. ప్రాపర్టీ ట్యాక్స్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) సంక్రాంతి పండగ వేళ భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీపి కబురు చెప్పింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారి కోసం ''వన్ టైమ్ సెటిల్మెంట్'' (OTS) పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరాని
ప్రాపర్టీ ట్యాక్స్


హైదరాబాద్, 09 జనవరి (హి.స.) సంక్రాంతి పండగ వేళ భాగ్యనగర

వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీపి కబురు చెప్పింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారి కోసం 'వన్ టైమ్ సెటిల్మెంట్' (OTS) పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పథకం ద్వారా పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది.

ఈ మేరకు పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో GHMC అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా లేదా తమకు దగ్గరలోని మీ-సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలో బకాయిలు చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande