ఆఫీస్కు రాకపోతే హైక్స్, ప్రమోషన్స్ ఉండవు.. ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరికలు
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కు పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద
టీసీఎస్


హైదరాబాద్, 09 జనవరి (హి.స.)

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కు పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. లేనిపక్షంలో వారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వంటివి నిలిపివేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు రోజుకు 9 గంటలు ఆఫీసులో గడపాలి.

దేశంలోని ఇతర ఐటీ కంపెనీలు వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీస్కు వస్తే చాలని చెబుతున్నారు. కానీ టీసీఎస్ మాత్రం ఐదు రోజులు కచ్చితంగా రావాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా వేరియబుల్ పే ను కూడా అటెండెన్స్తో లింక్ చేసింది. కంపెనీ నిర్ణయంతో సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande