
న్యూఢిల్లీ, 08 జనవరి (హి.స.)
దేశవ్యాప్తంగా రోజురోజుకూ
పెరుగుతున్న వీధి కుక్కల దాడులు (Stray dog attacks,), వాటి నియంత్రణ పై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడద తీవ్రమవుతున్న నేపథ్యంలో.. కుక్కలను పెంచుకునే బదులు పిల్లులను పెంచుకోండి, కనీసం అవి ఎవరిపై దాడి చేయవు కదా అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కుక్క కాటు బాధితుల సంఖ్య పెరుగుతుండటం, రేబిస్ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉండటం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జంతువుల పట్ల ప్రేమ ఉండాల్సిందేనని, అయితే అది మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని ధర్మాసనం పేర్కొంది.
కాగా ఇదే పిటీషన్లపై నిన్నటి విచారణలో.. వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కరుస్తాయో, వాటి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి తెలుస్తుందని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధికుక్కల్ని షెల్టర్ హోమ్స్ కు తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు