యువత క్రీడా ప్రతిభకు సీఎం కప్ పోటీలు : కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు, 08 జనవరి (హి.స.) యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని కలెక్ట
ములుగు కలెక్టర్


ములుగు, 08 జనవరి (హి.స.)

యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ వేదిక అని, ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. క్రీడాపోటీలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి అన్ని మండల కేంద్రాలలో టార్చ్ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande