
ములుగు, 07 జనవరి (హి.స.)
విద్యార్థిని విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి.. అని ఆదివాసీ గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న క్రీడ నైపుణ్యతను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశం అని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏటూరునాగారం మండల కేంద్రంలోనీ జంబోరి మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా.. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులు గిరిజన క్రీడాకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, వారి ఎదుగుదలకు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుటారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు