
తెలంగాణ, 07 జనవరి (హి.స.)
తెలంగాణ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రెండవ సాధారణ ఎన్నికలు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీ పలు ఆదేశాలు జారీ చేసింది. 13 జనవరి 2026న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ - T-POLL యాప్లో అప్లోడ్ చేయాలని, 16 జనవరి 2026న ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశించింది. బ్యాలెట్ బాక్సుల అంచనా వేసి, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారుల నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు