విద్యతోనే సర్వస్వం జయించవచ్చు: ఎమ్మెల్యే పోచారం
నిజామాబాద్, 07 జనవరి (హి.స.) విద్యతోనే సర్వస్వం జయించవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే అ
ఎమ్మెల్యే పోచారం


నిజామాబాద్, 07 జనవరి (హి.స.)

విద్యతోనే సర్వస్వం జయించవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే అన్నీ జయించవచ్చని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి పాటుపడుతున్నారని, విద్యా శాఖ వారి వద్దనే ఉందని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తామని, చదివించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande