భద్రాచలం 30 అక్టోబర్ (హి.స.)
భద్రాచలంలోని చెక్ పోస్ట్ వద్ద
రెండు ఆటోలలో తరలిస్తున్న 118 కేజీల గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒడిశాలోని కలిమల నుంచి భద్రాచలం మీదుగా ఇల్లందు తరలిస్తుండగా వారు చిక్కారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు పారిపోగా, ఒక మైనర్ బాలుడిని, మరొక యువకుడిని అరెస్టు చేశారు. రూ.31 లక్షల విలువ గల గంజాయిని ఆటోని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..