
గుంటూరు, 14 డిసెంబర్ (హి.స.)
,వైసీపీ నేత అంబటి రాంబాబుపై)కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జగన్ అదేశాలతో వైసీపీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని.. అంబటి రాంబాబు పరిస్థితి తాను అర్థం చేసుకోగలనని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల కామెంట్స్‌పై తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) గుంటూరు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ