
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆపార్టీ.. రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగిస్తోంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచి అభ్యర్థులు 600కు పైగా, భారత రాష్ట్ర సమితి మద్దతుతో 200కు పైగా, భాజపా 70, ఇతరులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు