
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)
, :ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం అంటే.. డిసెంబర్ 15వ తేదీన ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి నారా లోకేశ్ వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఏపీకి చెందిన పలు సమస్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రుల దృష్టికి లోకేశ్ తీసుకెళ్లనున్నారు. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సైతం లోకేశ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ