TTD  ఆధ్వర్యంలో నవంబర్ డిసెంబర్  నెలల్లో యుకే ఐర్లాండ్ యూరప్ లో 8దేశాల్లోని.13 నగరాల్లో.శ్రీనివాస కళ్యాణం
విజయవాడ, 30 అక్టోబర్ (హి.స.) తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు, డిసెంబరు నెలల్లో యూకే, ఐర్లాండ్‌, యూరప్‏ల్లో ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్‌ వెలగా, కృష్ణ జవాజీ,లు మంగళవా
TTD  ఆధ్వర్యంలో నవంబర్ డిసెంబర్  నెలల్లో యుకే ఐర్లాండ్ యూరప్ లో 8దేశాల్లోని.13 నగరాల్లో.శ్రీనివాస కళ్యాణం


విజయవాడ, 30 అక్టోబర్ (హి.స.)

తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు, డిసెంబరు నెలల్లో యూకే, ఐర్లాండ్‌, యూరప్‏ల్లో ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్‌ వెలగా, కృష్ణ జవాజీ,లు మంగళవారం టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతి()లోని టీటీడీ పరిపాలన భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి నవంబరు 9 నుంచి డిసెంబరు 21 వరకు ఏపీ ఎన్‌ఆర్‌టీ శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఈవోకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande