సామాజిక కుటుంబ సర్వేను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్
మెదక్ 13 నవంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పదొవ వార్డులో నిర్వహిస్తున్న సామాజిక సర్వేను ఆయ
మెదక్ జిల్లా కలెక్టర్


మెదక్ 13 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పదొవ వార్డులో నిర్వహిస్తున్న సామాజిక సర్వేను ఆయన పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వేను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారన్నారు.

సర్వేలో సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. సర్వే పై ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్వే 20% నుండి 30% వరకు పూర్తయిందన్నారు. పట్టణ, గ్రామాలలో ప్రజలు సర్వే అధికారులకు సహకరించి వారి వివరాలను తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రజనీకుమారి, ఆర్ఎ గౌసుద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి, శివరాజ్, కవిత అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande