హైదరాబాద్, 2 జనవరి (హి.స.)
దక్షిణ మధ్య రైల్వే నూతన ఎమ్.ఎమ్.టి. ఎస్ పబ్లిక్ టైమ్ టేబుల్ జనవరి1, 2025 నుండి అమల్లోకి వస్తుందని ప్రయాణికులు దయచేసి గమనించగలరు.
ప్రస్తుతం మొత్తం 88 ఎమ్.ఎమ్.టి.ఎస్ సర్వీసులు పని చేస్తున్నాయి. ఈ సేవల్లో సికింద్రాబాద్ - మేడ్చల్ మరియు ఫలక్‌నుమా - ఉమ్దానగర్ మరియు ఘట్‌కేసర్ - లింగంపల్లి విస్తరించిన నూతన సబర్బన్ సెక్షన్ కూడా ఉన్నాయి. ఈ ఎమ్.ఎమ్.టి.ఎస్ రైళ్ల సమయాలను ప్రయాణికుల సమయాలను దృష్టిలో ఉంచుకుని మరియు నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లను అనుసంధానం చేయడం కోసం సవరించడమైనది.
రైళ్లకు సంబంధించిన సమాచారం మరియు సంబంధిత స్టేషన్లలో సమయాల్లో మార్పులను నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్.టి.ఈ.ఎస్)ను సందర్శించడం ద్వారా లేదా సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్/ విచారణ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా పొందవచ్చునని తెలియజేయడమైనది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు