విజయవాడ, 4 జనవరి (హి.స.)
అత్యవసర వైద్యసేవలను అందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల డ్రోన్ వినియోగాన్ని మంగళగిరి ఎయిమ్స్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 20 కిలోమీటర్ల పరిధిలో వైద్యసేవల నమూనాలను తీసుకొస్తున్నారు. శుక్రవారం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందిరానగర్ ఆరోగ్య కేంద్రం నుంచి డ్రోన్‌ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్ స్మియర్ నమూనాలు రెండు నిమిషాల్లో ఎయిమ్స్‌కు చేర్చారు. వైద్యులను ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అభినందించారు. నోడల్ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.విజయలక్ష్మి, వైద్యాధికారిణి డాక్టర్ అనూష పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల