సిఎం.చంద్రబాబు.చిత్తూరు జిల్లాలో.పర్యటి కానున్నారు
విజయవాడ, 4 జనవరి (హి.స.) అమరావతి, జనవరి 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ) చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6 నుంచి 8 వరకు చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్
 సిఎం.చంద్రబాబు.చిత్తూరు జిల్లాలో.పర్యటి కానున్నారు


విజయవాడ, 4 జనవరి (హి.స.)

అమరావతి, జనవరి 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ) చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6 నుంచి 8 వరకు చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలతో సమావేశంకానున్నారు. పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రకృతి వ్యవసాయం విజన్‌లను ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణకుప్పం విజన్ 2029 పై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అగారాం కొత్తపల్లి గ్రామానికి వెళ్లి డ్వాక్రా సంఘాలతో సీఎం మాటామంతి నిర్వహించనున్నారు. 2:30 గంటలకు నడిమూరు గ్రామంలో సౌర విద్యుతీకరణ కార్యక్రమం ప్రారంభం అనంతరం స్థానిక యువతతో ఇష్టాగోష్టిలో పాల్గొటారు. అనంతరం సిగాల పల్లెకు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు ద్రవీడియన్ యూనివర్సటీ ఆడిటోరియంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. రాత్రి 7:30 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande