రైల్వే నిర్వహణలో భద్రత, ఆస్తుల పరిరక్షణ, పనులు మరియు శిక్షణలో నాణ్యత  దక్షిణ మధ్య రైల్వే కి  అత్యంత ప్రాధాన్యత  అంశాలు 
హైదరాబాద్, 4 జనవరి (హి.స.) ఉత్తమ పనితీరుకు గాను 75 సిబ్బంది/అధికారు లకు విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ అవార్డులు మరియు డివిజన్ & డిపార్ట్మెంట్ లకు 36 ఎఫిషియెన్సీ షీల్డ్‌ల ప్రదానం. దక్షిణ మధ్య రైల్వే 69 వ రైల్వే వారోత్సవాలనుఈ సందర్భంగా దక్
 రైల్వే నిర్వహణలో భద్రత, ఆస్తుల పరిరక్షణ, పనులు మరియు శిక్షణలో నాణ్యత  దక్షిణ మధ్య రైల్వే కి  అత్యంత ప్రాధాన్యత  అంశాలు 


హైదరాబాద్, 4 జనవరి (హి.స.) ఉత్తమ పనితీరుకు గాను 75 సిబ్బంది/అధికారు లకు విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ అవార్డులు మరియు డివిజన్ & డిపార్ట్మెంట్ లకు 36 ఎఫిషియెన్సీ షీల్డ్‌ల ప్రదానం.

దక్షిణ మధ్య రైల్వే 69 వ రైల్వే వారోత్సవాలనుఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌కుమార్‌ జైన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్‌లకు జోనల్‌ ఎఫిషియెన్సీ షీల్డ్‌లను, అధికారులు & సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగ్రవాల్ గారు, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, శ్రీ జె. వినయన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (జనరల్) శ్రీ ఉదయనాథ్ కోట్ల, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు , డివిజనల్ రైల్వేమేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అరుణ్ కుమార్ జైన్ అవార్డు గ్రహీతలను అభినందించారు మరియు 2024 సంవత్సరంలో వారు కనబరిచిన అంకితభావాన్ని మరియు ప్రతిభావంతమైన పనితీరును మెచ్చుకున్నారు.

డిసెంబర్, 2024లో జరిగిన జాతీయ రైల్వే వారోత్సవాల సందర్భంగా నిర్మాణం మరియు సివిల్ ఇంజినీరింగ్ విభాగాల్లో జోన్ రెండు పనితీరు సామర్థ్య షీల్డ్‌లను పొందిందని జనరల్ మేనేజర్ తెలియజేశారు. దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాలపై ప్రస్తావిస్తూ, జోన్ గత రెండు సంవత్సరాలలో అనూహ్యంగా ఉత్తమ పనితీరును కనబరిచిందని, అనేక విభాగాలలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పి, జోన్ యొక్క అర్హతలను బలోపేతం చేయడం మరియు అత్యుత్తమ పనితీరుని ప్రదర్శించే జోన్ లలో ఒకటిగా దేశవ్యాప్త గుర్తింపు పొందడం జరిగిందని పేర్కొన్నారు.

శ్రీ అరుణ్ కుమార్ జైన్ అధికారులు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే నిజమైన బలం దాని అంకితభావంతో కూడిన సిబ్బంది మరియు అద్భుతమైన టీమ్ వర్క్ అని అన్నారు. రైల్వే నిర్వహణలో భద్రత, ఆస్తుల పరిరక్షణ, పనులు మరియు శిక్షణలో నాణ్యత దక్షిణ మధ్య రైల్వే కి అత్యంత ప్రాధాన్యత అంశాలని సూచించారు. ఈ నాలుగు అంశాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని మరియు సంస్థ యొక్క మొత్తం విజయాన్ని నిర్ధారిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన పనిని అమలు చేయడం నేటి ఆవశ్యకమని, దాన్ని నిర్ధారించుకోవడం ద్వారానే ఆశించిన ఫలితాలు సాధించగలమని చెప్పారు. అందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన ప్రయాణం అనే రైల్వేలక్ష్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. భద్రతా ప్రమాణాలను అమలు చేయడంలో మరియు భద్రతా జాగ్రత్తలు పాటించడంలో రాజీపడకూడదని ఆయన పేర్కొన్నారు. జోన్ వృద్ధి ఊపందుకోవడం వలన దక్షిణ మధ్య రైల్వే కీర్తి ఎల్లప్పుడూ ఎత్తులో వుండాలని నేను గట్టిగా ఆశిస్తున్నానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జనరల్ మేనేజర్ ఓవర్ ఆల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్‌ను సికింద్రాబాద్ & విజయవాడ డివిజన్‌లకు సంయుక్తంగా ప్రదానంచేయబడింది .

జనరల్ మేనేజర్ ఓవర్ ఆల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ షీల్డ్‌ను సికింద్రాబాద్ & విజయవాడ డివిజన్‌లకు సంయుక్తంగా శ్రీ అరుణ్ కుమార్ జైన్ అందించారు. ఈ షీల్డ్‌ను సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎ. నరేంద్ర పాటిల్ అందుకున్నారు.

జోన్‌లోని వివిధ డివిజన్‌లు మరియు వర్క్ షాప్‌లకు జనరల్ మేనేజర్ ఇతర 35 జోనల్ స్థాయి ఎఫిషియెన్సీ షీల్డ్‌లను కూడా ప్రదానం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande