విజయవాడ, 4 జనవరి (హి.స.)
సబ్బవరం: ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా సబ్బవరం మండలం నుంచి అధిక సంఖ్యలో 7500 మంది నీ సమీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో పి. పద్మజ ఏర్పాటు చేసిన సమావేశంతో సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సమీకరించిన ప్రజలను సబ్బవరం నుంచి విశాఖపట్నం పంపించేందుకు 150 బస్సులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఏ ఏ గ్రామానికి ఎన్ని బస్సులు పంపిస్తున్నది వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భోగం సూర్యకుమారి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంగా మనమంతా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమం జయప్రదం చేయాలని ఆమె కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల