విజయవాడ, 20 నవంబర్ (హి.స.)
,: కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM ప్రజా గళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్కార్ పేర్కొంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు వచ్చిన లేఖతో ప్రక్రియను న్యాయశాఖ మొదలుపెట్టింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాలు కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర మొత్తం జనాభాలో 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్‌లో 1.59 కోట్ల మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది ఈ రీజియన్‌లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల