విజయవాడ, 20 నవంబర్ (హి.స.)
ప్రకాశం: అవినీతి నిరోధక శాఖ(అనిశా) వలకు ఓ అవినీతి చేప చిక్కింది. ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నగరంలోని స్థానిక సీహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి, దానిపై జరిమానా విధించారు. ఆ జరిమానా లేకుండా చేయడానికి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సదరు వ్యాపారి నుంచి రూ.1.50లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు తన కార్యాలయంలో ఆ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును రికవరీ చేశారు. డీఎస్పీ వెంట సీఐ శేషు, ఎస్సైలు జేబీఎన్ ప్రసాద్, షేక్ మస్తాన్ షరీఫ్, సిబ్బంది ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల