హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబర్) 2024 (యూజీసీ- నెట్ డిసెంబర్ 2024) నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్‌తోపాటు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికి డిసెంబర్ సెషన్‌కు యూజీసీ- నెట్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెట్‌కు అర్హత సాధిస్తే యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి, జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ఫెలోషిప్ లభిస్తుంది. జేఆర్‌ఎఫ్ పూర్తిచేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. వీరికి కూడా స్కాలర్‌షిప్ అందుతుంది. తద్వారా పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు