హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొన్నంని ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ వచ్చింది.. బండి సంజయ్‌ని రెండు సార్లు గెలిపిస్తే కరీంనగర్ కి పైసా అయినా తెచ్చిండా…? అని సీఎం ప్రశ్నించారు. మిడ్ మానేర్ నిర్వాసితుల పోరాటంలో పాల్గొని వారికి ఇచ్చిన హామీని ఈరోజు అమలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాం.. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్నవాటిని వెంటనే పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు