గంజాయి ఇతర.మరాజదేవ్యాల సఫర అమ్మకాలు.అదుపు చేయడానికి కొత్త.పోలీసు.విభాగం ఏర్పాటు
విజయవాడ, 21 నవంబర్ (హి.స.) అమరావతి,: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ‘ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌గా వ్యవహరించే ఈ విభాగానికి ‘ఈగిల్‌’
 గంజాయి ఇతర.మరాజదేవ్యాల సఫర అమ్మకాలు.అదుపు చేయడానికి కొత్త.పోలీసు.విభాగం ఏర్పాటు


విజయవాడ, 21 నవంబర్ (హి.స.)

అమరావతి,: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ‘ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌గా వ్యవహరించే ఈ విభాగానికి ‘ఈగిల్‌’ అని నామకరణం చేశారు. గత ప్రభుత్వం రూ.100 కోట్లకు పైబడిన టెండర్లకు సంబంధించి సమీక్షకు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను రద్దుచేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఇరవై బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 22 బిల్లులు దాని ముందుకు రాగా.. 20 బిల్లులపై ఆమోదముద్ర వేసింది. ఆమోదించని రెండు బిల్లులూ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించినవి. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం పెట్టడానికి నాలుగేళ్ల గడువు ఉండాలని గతంలో నిర్ణయించారు. దానిని రెండున్నరేళ్లకు తగ్గిస్తూ పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు మంత్రివర్గ సమావేశం ముందుకు బిల్లులను తెచ్చాయి. ఈ వ్యవహారంలో మరికొంత చర్చ అవసరమని, తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదావేశారు. ఆయన అధ్యక్షతన బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో కేబినెట్‌ సమావేశమైంది. లోకాయుక్త నియామకానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. గతంలో చేసిన చట్టం ప్రకారం.. లోకాయుక్త నియామకాన్ని ఆమోదించే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరు.

దీంతో ప్రతిపక్ష నేత బదులు.. చట్ట సభల సభ్యులు ఎవరైనా ఉండవచ్చన్న సవరణను ప్రతిపాదించారు. రేషన్‌ బియ్యం అక్రమాలను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) చట్టం పరిధిలోకి తెస్తూ చేసిన సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ఈ చట్టం కింద గతంలో కేవలం ఐదు రకాల నేరాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో 8 రకాల నేరాలను చేర్చారు. అందులో రేషన్‌ బియ్యం అక్రమాలూ ఒకటి. భూ కబ్జాల నిరోఽధ చట్టానికి కూడా మరిన్ని కోరలు తొడిగి కఠిన శిక్షలు పడేలా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. తగిన భద్రత ఉంటే రాష్ట్రంలో పర్యాటకం పెరుగుతుందని, పర్యాటకులు పెరిగితే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేబినెట్‌ అభిప్రాయపడింది. దీని కోసం బీచ్‌ల వద్ద ఈతగాళ్లను నియమించాలని, పోలీసు భద్రత కల్పించాలని, లోపలి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు తగినంత భద్రత కల్పించి ఎక్కడికైనా వెళ్లి క్షేమంగా తిరిగి రాగలిగే పరిస్థితులు కల్పించాలని నిర్ణయించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande