కడప, 21 నవంబర్ (హి.స.) : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందిన సతీష్‌కుమార్. హరిహర కార్ రెంటల్ పేరిట సంస్థను నడుపుతూ కార్లను అద్దెకు ఇస్తుంటారు. ఇదే రాష్ట్రానికి చెందిన వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌కు 2021, ఏప్రిల్‌లో అయిదు కార్లను అద్దెకు ఇచ్చారు. నాలుగు నెలల పాటు అద్దె ఇచ్చి అనంతరం చెల్లించకపోవడంతో అతని కోసం గాలించగా కనిపించలేదు. చివరకు కార్లు పులివెందుల వైద్యకళాశాలకు లీజుకు ఇచ్చారని తెలుసుకుని సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. కార్ల కోసం అప్పటి వేంపల్లె ఎస్సైని సతీష్‌కుమార్ కలవగా, ఆయన వైకాపా నేతలతో మాట్లాడాలని ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి, మాజీ సర్పంచి శివశంకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భారతి, వైకాపా నాయకుడు ప్రసాద్‌రెడ్డి వద్దకు పంపారు. వారంతా తనను కొట్టి కార్లు అడిగితే చంపేస్తామని బెదిరించారని వివిధ రూపాల్లో ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల