విజయవాడ, 21 నవంబర్ (హి.స.)మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసనసభలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం. తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చాం. అనేక సదస్సులు ఏర్పాటుచేసి విశాఖపై దృష్టిసారించాం. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం.. కానీ అది ఆగిపోయింది. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల