వరంగల్.జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలోని. ఎస్బిఐ బ్యాంకులో అర్థరాత్రి భారీ చోరి
విజయవాడ, 21 నవంబర్ (హి.స.) రాయపర్తి, వారంతా నిరుపేదలు.. బ్యాంకులో తనఖా పెడితే నగదు, బంగారం భద్రంగా ఉంటుందని అనుకున్నారు. కాయకష్టం చేసి సంపాదించి పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం దాచుకున్నారు.. దోపిడీదారులు ఆ పేదల సొమ్ముపై కన్నేశారు.
వరంగల్.జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలోని. ఎస్బిఐ బ్యాంకులో అర్థరాత్రి భారీ చోరి


విజయవాడ, 21 నవంబర్ (హి.స.)

రాయపర్తి, వారంతా నిరుపేదలు.. బ్యాంకులో తనఖా పెడితే నగదు, బంగారం భద్రంగా ఉంటుందని అనుకున్నారు. కాయకష్టం చేసి సంపాదించి పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం దాచుకున్నారు.. దోపిడీదారులు ఆ పేదల సొమ్ముపై కన్నేశారు. బ్యాంకు లాకరునే పగులగొట్టి దోచుకెళ్లారు. ఈ విషయం తెలిసి బాధితులు ఆందోళన చెందుతున్నారు. మీ సొమ్ముకు తమది భరోసా అని బ్యాంకర్లు చెబుతున్నా వారికి నమ్మకం కుదరడం లేదు. బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధికారులను వేడుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande