గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్‌: హోంమంత్రి అనిత
విజయవాడ, 21 నవంబర్ (హి.స.)వైకాపా ప్రభుత్వం గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు. ఐదేళ్లలో జగన్‌ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని.. దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్‌: హోంమంత్రి అనిత


విజయవాడ, 21 నవంబర్ (హి.స.)వైకాపా ప్రభుత్వం గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు. ఐదేళ్లలో జగన్‌ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని.. దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామని.. దీంతో నేరస్థులను అణచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande