ఉన్నత విద్య  అభ్యసించే.విద్యార్దులకు  ప్రభుత్వం శుభవార్త
విజయవాడ, 21 నవంబర్ (హి.స.) అమరావతి,): ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఐదేళ్లుగా పడుతున్న ఫీజు కష్టాల నుంచి వారిని గట్టెక్కించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరు
 ఉన్నత విద్య  అభ్యసించే.విద్యార్దులకు  ప్రభుత్వం శుభవార్త


విజయవాడ, 21 నవంబర్ (హి.స.)

అమరావతి,): ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఐదేళ్లుగా పడుతున్న ఫీజు కష్టాల నుంచి వారిని గట్టెక్కించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు(ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని పేర్కొంది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. కాగా, జగన్‌ హయాంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019కి ముందు ఫీజులను కాలేజీలకు జమ చేసే విధానం ఉండగా, పారదర్శకత పేరుతో జగన్‌ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు ఫీజులు ఇచ్చే విధానం తెచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande