సైబరాబాద్‌లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయా
సైబరాబాద్‌లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు. తమ కంపెనీలో 8 లక్షల 8 వేల రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి.. రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే, 25 నెలల పాటు ప్రతి నెలా 4 శాతం చొప్పున అంటే నెలకు రూ.32 వేలు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా.. ఈ స్కీమ్‌లో మరెవరినైనా చేర్పించినా వారికి 25 నెలల పాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపింది 12 వెల్త్ సంస్థ. ఇదేగాక.. డబుల్‌ గోల్డ్‌ స్కీమ్‌లో కనీసం రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తరువాత రూ.8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్‌ గోల్డ్‌ బిస్కెట్ ఇస్తామని ట్రాప్ చేశారు. అంతేకాకుండా.. గోల్డ్‌ చిట్‌ స్కీమ్‌ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే 19 నెలల పాటు నెలకు 15 వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని.. 20వ నెల మరో 15 వేలు అదనంగా చెల్లిస్తామని నమ్మించారు కేటుగాళ్లు. ఈ క్రమంలో 3600 మంది బాధితులు పెట్టుబడి పెట్టి మోసపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande