వైద్యులు  ఎక్కువగా.జనరిక్. మందులను సిఫార్సు చేయకపోవడం  వల్లే  ప్రజల్లో అవగాహన తక్కువ
విజయవాడ, 20 నవంబర్ (హి.స.) అమరావతి: వైద్యులు ఎక్కువగా జనరిక్ మందులను సిఫార్సు చేయకపోవడం వల్లే ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 560 రకాల జనరిక్ మందులను వినియోగించేందుకు వీలుగా కార్యాచరణను
వైద్యులు  ఎక్కువగా.జనరిక్. మందులను సిఫార్సు చేయకపోవడం  వల్లే  ప్రజల్లో అవగాహన తక్కువ


విజయవాడ, 20 నవంబర్ (హి.స.)

అమరావతి: వైద్యులు ఎక్కువగా జనరిక్ మందులను సిఫార్సు చేయకపోవడం వల్లే ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 560 రకాల జనరిక్ మందులను వినియోగించేందుకు వీలుగా కార్యాచరణను చేపట్టామని తెలిపారు. జనరిక్ మందుల నాణ్యత, ప్రమాణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. బ్రాండెడ్ మందులు, జనరిక్ ఔషధాలకు ఎలాంటి తేడా లేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 215 జనరిక్‌ ఔషధ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రంలో 2.15 లక్షల కోట్ల ఔషధాల విక్రయాలు జరుగుతుండగా.. వాటిలో జనరిక్ ఔషధ విక్రయాలు 7శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఈ అంశంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande