దిల్లీ 29 నవంబర్ (హి.స.)ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత రోజే ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌పై దాడికి పాల్పడ్డాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గమనించే తాము దాడి చేసినట్లు టెల్ అవీవ్ పేర్కొనింది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో మంగళవారం నాడు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. కానీ, బుధవారం ఉదయం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే, హెజ్‌బొల్లాయే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల