పశ్చిమబెంగాల్‌లో 58 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు రంగం సిద్ధం
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.)పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR in West Bengal) జరుగుతోంది. ఇందులో ప్రస్తుతం చేపట్టిన సవరణల్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 58 లక్షలకు పైగా ఓట్ల త
Distribution of counting forms to over 5 crore voters in the 2025 voter list across Gujarat completed


అమరావతి, 15 డిసెంబర్ (హి.స.)పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR in West Bengal) జరుగుతోంది. ఇందులో ప్రస్తుతం చేపట్టిన సవరణల్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 58 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు రంగం సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు, స్థానచలనం చెందినవారు, సంప్రదించడానికి సాధ్యపడనివారు, ఇతర కారణాల దృష్ట్యా వీరి పేర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ (EC) ఆదివారం సాయంత్రం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణను ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రత్యేక సమగ్ర సవరణ’ ఎలక్టోరల్‌ రోల్స్‌ ప్రచురణ ప్రారంభమయ్యిందని.. మంగళవారం దీనిని ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు. ఈ ప్రక్రియలో బెంగాల్ (Bengal) వ్యాప్తంగా 90వేలకు పైగా బూత్‌స్థాయి అధికారులు (BLO) పాల్గొన్నారన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో ‘సర్‌’ పనులను నవంబరు 4న ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande