
ఢిల్లీ 15,డిసెంబర్ (హి.స.) దిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన (PM Modi 3 Nation Visit)లో జాప్యం నెలకొంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన (Jordan, Ethiopia and Oman Tour)కు సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ బయల్దేరాల్సి ఉంది. అయితే దిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రధాని విమానం ఆలస్యమయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు పొగమంచు కారణంగా దిల్లీ (Delhi) విమానాశ్రయం నుంచి వెళ్లే పలు విమాన సర్వీసుల్లో ఆలస్యం నెలకొన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండిగో, ఎయిరిండియా వంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయంలో దృశ్యగోచరత తగ్గడం వల్ల పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయని తెలిపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ