కొత్త లేబర్ కోడ్స్‌పై కేంద్ర కార్మిక శాఖ క్లారిటీ.
ఢిల్లీ 15,డిసెంబర్ (హి.స.) భారతదేశంలో సాధారణంగా ఉద్యోగులు వారానికి 5 రోజులు పని చేసే విధానం కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు 4 రోజుల పని వరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అయితే అవి మంచి ఫలితాలు సాధించడంతో భారత్‌లో కూడా ఇద
కొత్త లేబర్ కోడ్స్‌పై కేంద్ర కార్మిక శాఖ క్లారిటీ.


ఢిల్లీ 15,డిసెంబర్ (హి.స.) భారతదేశంలో సాధారణంగా ఉద్యోగులు వారానికి 5 రోజులు పని చేసే విధానం కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు 4 రోజుల పని వరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అయితే అవి మంచి ఫలితాలు సాధించడంతో భారత్‌లో కూడా ఇదే విధానం సాధ్యమా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.

కేంద్ర కార్మిక శాఖ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం 4 రోజుల పని విధానం సాధ్యమేనని తెలిపింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వారానికి మొత్తం పని గంటలు 48 గంటలు మించకూడదు. అంటే ఉద్యోగులు 4 రోజులు పనిచేస్తే, రోజుకు గరిష్టంగా 12 గంటలు పని చేయవచ్చు. మిగిలిన 3 రోజులు పెయిడ్ సెలువులుగా ఉంటాయి.

అయితే రోజుకు 12 గంటల పని అనగానే నిరంతరం 12 గంటలు డెస్క్ వద్దే కూర్చోవాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ వివరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande