ముఖ్యమంత్రి కార్యాలయం లో డిప్యూటీ.సిఎం.పవన్ కళ్యాణ్.హోం మంత్రి అనిత భేటీ
విజయవాడ, 7 నవంబర్ (హి.స.) అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శా
ముఖ్యమంత్రి కార్యాలయం లో డిప్యూటీ.సిఎం.పవన్ కళ్యాణ్.హోం మంత్రి అనిత భేటీ


విజయవాడ, 7 నవంబర్ (హి.స.)

అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను పవన్‌ కల్యాణ్‌కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు. తానూ ఫేక్ పోస్టు బాధితురాలినంటూ అంటూ అనిత పవన్ కల్యాణ్‌తో అన్నారు. తన కూతురు కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande