దిల్లీ, 26 డిసెంబర్ (హి.స.)చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి. జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. నీటి సరఫరా గొట్టాల్లో నీరు గడ్డకట్టేస్తోంది. శ్రీనగర్‌లో మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండ్రోజుల్లో ఇది మరో 2-3 డిగ్రీల వరకు తగ్గిపోతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కశ్మీర్‌లో అత్యంత చల్లగా ఉండే 40 రోజుల కాలం ఈ నెల 21న ప్రారంభమైంది. అప్పటి నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. అమర్‌నాథ్ యాత్రకు బేస్‌క్యాంపు అయిన పహాల్గామ్‌లో మైనస్ 8.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలకు అత్యంత చల్లని రోజుగా బుధవారం నిలిచిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు