తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)
కర్నాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాల సందర్భంగా నగరం అంతా పోస్టర్లను ప్రదర్శించారు. అయితే ఆ పోస్టర్లపై ఉన్న భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించారు. ఆ పోస్టర్లలో ఉన్న మ్యాప్లో.. పాక్ ఆక్రమిత గిల్గిత్ ప్రాంతం కానీ, చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం లేవు.. ఆ రెండు ప్రాంతాలు జమ్మూకశ్మీర్లోనివే... ఈ విషయంపై బీజేపీ సీరియస్ గా స్పందించింది..
ఈ వివాదంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. పోస్టర్లలో ఏదైనా పొరపాటు ఉంటే, వాటిని తొలగిస్తామన్నారు. బహుశా కొందరు తప్పు చేసి ఉంటారు, వాటిని తొలగిస్తున్నామన్నారు. కావాలని బీజేపీ తమను అటాక్ చేస్తోందని, ఈర్ష్యకు మందు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ మొహబత్ కి దుకాన్.. ఎప్పుడూ చైనా కోసం తెరిచి ఉంటుందని, ఈ దేశాన్ని ముక్కలు చేస్తారని, గతంలో చేశారని, మళ్లీ చేస్తారని బీజేపీ ఆరోపించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ భారతదేశ మ్యాప్ను సరిగా చిత్రీకరించలేదని బీజేపీ విమర్శించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్