హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగునున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ ఆప్, అరవింద్ కేజీవాల్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అజయ్ మాకెన్ని 24 గంటల్లో తొలగించాలని ఆప్ అల్టిమేటం విధించింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ని తొలగించాలని ఇతర పార్టీలను కోరుతామని ఆప్ నేతలు చెప్పారు.
ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీకి సాయం చేస్తుందని ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి ఆరోపనలే చేశారు. 'బీజేపీకి ఎన్నికల్లో లాభం చేకూరేందుకు కాంగ్రెస్ అన్నీ చేస్తోంది. అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్ట్ చదవి, బీజేపీ ఆదేశాల మేరకు ప్రకటన చేస్తూ, బీజేపీ సూచనల మేరకు ఆప్ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్