తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)
రైలు టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ (IRCTC) గురువారం ఉదయం చాలా సేపు నిలిచిపోయింది. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు టికెట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వెబ్సైట్ ఓపెన్ కాలేదు. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఇ- టికెట్ సేవ అందుబాటులో ఉండదని సందేశం చూపించింది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. అని సమాధానం వచ్చింది. ఎవరైనా తన పాత బుక్ చేసిన టిక్కెట్లను రద్దు చేయాలనుకుంటే, కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ నంబర్, ఇమెయిల్ ను సంప్రదించాలని ప్రదర్శించిన మెసేజ్‌లో పేర్కొన్నారు. 14646,08044647999 & 08035734999 లేదా etickets@irctc.co.in ఈమెయిల్ ప్రదర్శించారు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే సైట్ నిలిచిపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్సీటీసీని ట్యాగ్ చేస్తూ.. అనేక ప్రశ్నలు సంధించారు.
ఇదిలా ఉండగా.. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండో సారి. డిసెంబర్ 9న కూడా యాప్, వెబ్సైట్ దాదాపు రెండున్నర గంటల పాటు నిలిచిపోయాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్