ఆప్‌తో పొత్తు మా పెద్ద తప్పు
దిల్లీ , 26 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్‌ నేత, ఏఐసీసీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆప్‌నకు మద్దతివ్వడం కాంగ్రెస్‌ చేసిన అతి పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. అందువల్లే దిల్లీలో కాంగ్రెస్‌ పా
ఆప్‌తో పొత్తు మా పెద్ద తప్పు


దిల్లీ , 26 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్‌ నేత, ఏఐసీసీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆప్‌నకు మద్దతివ్వడం కాంగ్రెస్‌ చేసిన అతి పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. అందువల్లే దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని వ్యాఖ్యానించారు. తాము చేసిన ఆ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మాకెన్‌ తెలిపారు. దిల్లీ కాంగ్రెస్‌ బుధవారం 12 అంశాలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యాయంటూ ఆప్, భాజపాలపై అజయ్‌ మాకెన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జన్‌లోక్‌పాల్‌ ఉద్యమంతో పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఆప్‌ ఇప్పటికీ దానిని ఏర్పాటు చేయలేదని ఆక్షేపించారు. దిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమకు సహకరించడంలేదని చెబుతున్న ఆప్‌ నాయకులు....వారు అధికారంలో ఉన్న పంజాబ్‌లో జన్‌లోక్‌పాల్‌ను ఎందుకు అమలులోకి తీసుకురాలేదని ప్రశ్నించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande