హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు పెళ్లి కూతురు కాబోతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పీవీ సింధు పెళ్లి జరగనుంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఆమె పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి.. పీవీ రమణ వెల్లడించారు. కాగా ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.రెండు కుటుంబాలు కలిసి నెల క్రితమే వీరి పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే నెల నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉంది. అందుకే ఈ నెలలోనే పెళ్లి జరిపించాలని డిసైడ్ అయ్యాం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లిని ఘనంగా నిర్వహిస్తాం. ఈనెల 24 హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఈనెల 20 నుంచి జరుగుతాయి అని పీవీ సింధు తండ్రి పీవీ రమణ మీడియాకు వెల్లడించారు.కాగా భారత క్రీడా రంగంలో పీవీ సింధుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె ఖాతాలో రెండు ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..