పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకం కింద పూజారులకు నెల కు 18 వేల రూపాయలు ఇస్తాం..ఆప్ అధినేత కేజ్రివాల్ 
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) పూజారులకు నెలకు రూ.18,000 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. సోమవారం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రివాల్ ప్రకటించారు. ఈ పథకం కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని 'గ్రంథి'లకు నెలకు ర
ఆప్ అధినేత కేజ్రివాల్


హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) పూజారులకు నెలకు రూ.18,000 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

సోమవారం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రివాల్ ప్రకటించారు.

ఈ పథకం కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని 'గ్రంథి'లకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని కేజ్రీ వాల్ తెలిపారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 'పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన'ను ప్రారంభిస్తామని, దీని కింద ఆలయ పూజారులు, గురుద్వారాలకు నెలవారీగా రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని అరవింద్ కేజ్రీవాల్ సోమవారం వివరించారు. మంచి, చెడు సమయాల్లో ప్రజల జీవితాల్లో పూజారులు, గ్రంథులు మంచి పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ స్థాయిలో వేతనం ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అర్చకులు ప్రాచీన ఆచారాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. వారు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోరని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande