సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించడాన్నిఅభిషేక్‌ సింఘ్వీ ప్రశంసించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రస్తుతం కానీ, గతంలోకానీ న్యాయమూర్తులుగా పనిచేసినవారి సంతానాన్నీ లేదా బంధువులను హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించరాదని కొలీజియం ప్రతిపాదను
 సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించడాన్నిఅభిషేక్‌ సింఘ్వీ ప్రశంసించారు.


దిల్లీ: , 2 జనవరి (హి.స.)సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రస్తుతం కానీ, గతంలోకానీ న్యాయమూర్తులుగా పనిచేసినవారి సంతానాన్నీ లేదా బంధువులను హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించరాదని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించడాన్ని సుప్రసిద్ధ న్యాయవాది, కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ సింఘ్వీ ‘ఎక్స్‌’లో ప్రశంసించారు. ఈ ప్రతిపాదనను వెంటనే అమలుచేయాలని కోరారు. న్యాయమూర్తుల నియామకాలు నిష్పాక్షికంగా జరగాల్సి ఉన్నా వాస్తవంలో అలా జరగడం లేదన్నారు. ఇంతవరకు కనీసం హైకోర్టు న్యాయమూర్తుల బంధువులు సదరు హైకోర్టులలో న్యాయవాదులుగా పనిచేయకుండా కూడా నిషేధించలేకపోయామని ఆయన గుర్తుచేశారు. ‘‘పూర్వకాలంలో రాజులు మారువేషాల్లో తమ రాజ్యంలో తిరుగుతూ పరిస్థితులను, ప్రజా సమస్యలను తెలుసుకునేవారు. పదోన్నతి కోసం పరిశీలనలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తుల పనితీరును కూడా కొలీజియం సభ్యులు అదేవిధంగా పరిశీలించాలి, కోర్టులకు మారువేషాల్లో హాజరవ్వాలి’’ అని సింఘ్వీ సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande