దేశ రాజధాని ఢిల్లీలో వేడెక్కిన రాజకీయ వాతావరణం..
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమం
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయ వాతావరణం


హైదరాబాద్, 2 జనవరి (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిపడేసింది. ఇక, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రివాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించింది. ఇది కేజీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్రంగా మండిపడింది. ఆప్కు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే మీనింగ్ వచ్చేలా ఒక పోస్టర్ను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఆ విమర్శను తిప్పి కొడుతూ 'గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) అంటూ కేజీవాల్ ఉన్న మరో పోస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande