తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తర్వాత పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కాగా.. ఇలాంటి టైంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వియత్నాం ట్రిప్ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తుంటే.. రాహుల్ మాత్రం న్యూ ఇయర్ కోసం వియత్నాం వెళ్లారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ఆపరేషన్ బ్లూ స్టార్ను ఎత్తిచూపుతూ.. గాంధీలు, కాంగ్రెస్ పార్టీ సిక్కులను ద్వేషిస్తూనే ఉంటాయన్నారు. ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్ను అపవిత్రం చేశారనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని ఆరోపించారు. అంతేకాకుండా, మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్