స్టేజి పైనుండి కింద పడిపోయిన కేరళ  కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్..
తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.) కేరళకు చెందిన మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ ఆదివారం రోజు ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. అయితే అక్కడి స్టేజీపైకి ఎక్కిన ఆమె.. పొరపాటున కాలుజారి కింద పడిపోయారు. 20 అడుగుల పైనుంచి ఆమె కింద పడడంతో.. తలకు, వెన్నుముక
కేరళ  కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్..


తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)

కేరళకు చెందిన మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ ఆదివారం రోజు ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. అయితే అక్కడి స్టేజీపైకి ఎక్కిన ఆమె.. పొరపాటున కాలుజారి కింద పడిపోయారు. 20 అడుగుల పైనుంచి ఆమె కింద పడడంతో.. తలకు, వెన్నుముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే ఉమా థామస్‌ను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాయి. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు కేరళ మంత్రి రాజీవ్ తెలియజేశారు.24 గంటల గడిచిన తర్వాతే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పగలమని వైద్యులు వివరించినట్టు వారు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande