కొనసాగుతున్న పంజాబ్‌ బంద్‌.. 163 రైళ్ల రద్దు
ఢిల్లీ 30 డిసెంబర్ (హి.స.)తమ డిమాండ్లు పరిష్కరించాలని పంజాబ్‌ రైతులు చేపట్టిన బంద్‌ (Punjab Bandh) పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. చాలాచోట్ల రహదారులను మూసివేసి రైతులు పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో
కొనసాగుతున్న పంజాబ్‌ బంద్‌.. 163 రైళ్ల రద్దు


ఢిల్లీ 30 డిసెంబర్ (హి.స.)తమ డిమాండ్లు పరిష్కరించాలని పంజాబ్‌ రైతులు చేపట్టిన బంద్‌ (Punjab Bandh) పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. చాలాచోట్ల రహదారులను మూసివేసి రైతులు పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పోలీసులు నిరసనకారులను అడ్డుకుంటున్నారు.

రైతుల న్యాయమైన డిమాండ్లపై కేంద్రం స్పందించడం లేదంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా(నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరసన కొనసాగించనున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. పటియాల-చండీగఢ్‌ జాతీయ రహదారిపై టోల్‌ ప్లాజాల వద్ద రైతులు ధర్నాకు దిగడంతో ఆ మార్గంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అమృత్‌సర్‌ గోల్డెన్‌ గేట్‌ వద్ద రైతులు పెద్దసంఖ్యలో నిరసన చేపట్టారు. బటిండాలోని రాంపుర్‌లో ఎంట్రీ పాయింట్ల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో నగరంలోకి రాకపోకలపై ప్రభావం పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande