హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)
పుష్ప 2 ప్రీమియం షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లోవజరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు
అందిన ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. న్యాయవాది రామారావు ఇమ్మినేని,కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పుష్ప 2 ప్రీమియం షో చూసేందుకు అల్లు అర్జున్, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్దకు తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో చేరుకున్నారు.అల్లు అర్జున్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించగా, అప్పటికే థియేటర్ లోపలా, బయటా కిక్కిరిసిపోయి
ఉన్న అభిమానులు ఆయనను
చూసేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..